News February 21, 2025

మసీదుల వద్ద సదుపాయాలు కల్పించాలని HNK కలెక్టర్‌కు వినతి

image

రానున్న రంజాన్ పండగ సందర్భంగా హనుమకొండ ప్రాంతంలో ఉన్న మసీద్ కేంద్రాల వద్ద ప్రభుత్వం నుంచి సదుపాయాలు కల్పించాలని కోరుతూ శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అజీజ్ మిర్జా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మిర్జా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరినట్లు తెలిపారు.

Similar News

News February 22, 2026

సిద్దిపేట: గ్రామం నుంచి ALL INDIA పోటీలకు

image

రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్‌లో జరగనున్నాయి.

News February 22, 2026

పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

image

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.

News February 22, 2026

భారీగా తగ్గిన క్యారెట్, బీట్‌రూట్ ధరలు

image

AP: రాష్ట్రంలో క్యారెట్, బీట్‌రూట్ ధరలు పడిపోయాయి. సాధారణంగా ఇవి కేజీకి రూ.80-100 చొప్పున విక్రయిస్తారు. అయితే రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్‌రూట్ సాగు పెరగడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో క్యారెట్, బీట్‌రూట్ కేజీకి రూ.30-40 చొప్పున లభ్యమవుతున్నాయి. అటు తెలంగాణలోనూ వీటి ధరలు కాస్త తగ్గి కేజీ రూ.50-70 మధ్య ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.