News June 27, 2024

మస్కట్‌లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్‌కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Similar News

News November 11, 2025

NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

image

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.

News November 11, 2025

NZB: DDలో పట్టుబడితే రూ.10వేల జరిమానా: ట్రాఫిక్ CI

image

నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్ (DD)లో పట్టుబడితే రూ.10 వేల జరిమానాతోపాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంటుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని ఆయన హెచ్చరించారు.

News November 11, 2025

ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

image

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.