News December 29, 2025

మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతున్నారా?

image

AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు కాయిల్ ఆర్పివేయడం లేదా బెడ్‌కు దూరంగా ఉంచుకోవాలి.

Similar News

News December 31, 2025

‘వన్ పేజ్’ క్యాలెండర్: ఒకే పేజీలో 365 రోజులు

image

క్యాలెండర్‌లో ప్రతి నెలా పేజీలు తిప్పే శ్రమ లేకుండా ఏడాది మొత్తాన్ని ఒకేచోట చూస్తే ఎంత బాగుంటుంది? అదే ఈ ‘వన్ పేజ్ క్యాలెండర్’ ప్రత్యేకత. ఇందులో ఏ రోజున ఏ వారం వస్తుందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఎడమవైపున్న డేట్స్‌తో కుడివైపున్న నెలలు-వారాలను సరిచూసుకుంటే చాలు. ఆఫీస్ టేబుల్స్ లేదా ఇంటి గోడలపై దీనిని ఏర్పాటు చేసుకోండి. ఈ వినూత్న క్యాలెండర్‌ను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేసి 2026కి వెల్కమ్ చెప్పండి.

News December 31, 2025

Stock Market: లాభాలతో వీడ్కోలు.. ఏడాదిలో 10% జంప్!

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 2025కు భారీ లాభాలతో వీడ్కోలు పలికాయి. నిఫ్టీ 190 పాయింట్లు పెరిగి 26,129 వద్ద.. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 85,220 వద్ద ముగిసింది. సెన్సెక్స్30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయాయి. మొత్తంగా 2025లో నిఫ్టీ 10.5%, సెన్సెక్స్ 9.06% పెరగడం విశేషం. మన సూచీలు వరుసగా పదో ఏడాది వృద్ధిని నమోదు చేశాయి.

News December 31, 2025

‘రాజాసాబ్’లో 40 నిమిషాల క్లైమాక్స్: డైరెక్టర్

image

ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమాలో క్లైమాక్సే 40 నిమిషాలు ఉంటుందని డైరెక్టర్ మారుతి వెల్లడించారు. ‘చివరి 35-40 నిమిషాలు ఏం జరుగుతోందనే ఫీల్‌లోకి వెళ్లిపోతారు. కథ, యాక్షన్, డ్రామాతో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా రాశాం’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మూవీలో మొత్తం 5-6 యాక్షన్ సీన్లలో రెండు భారీ సీన్లు ఉంటాయని చెప్పారు. ఈ మూవీ జనవరి 9న థియేటర్లలోకి రానుంది.