News April 4, 2025
మహబూబాబాద్‌లో ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’

మహబూబాబాద్ జిల్లాలోని DFO ఆఫీసులో “అమ్మ పేరు మీద ఒక చెట్టు” పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలపై అమ్మపై చూపించే చూపించాలని పేర్కొన్నారు.
Similar News
News April 11, 2025
నిర్మల్: MAY 1 నుంచి క్రీడా శిబరాలు.. APPLY NOW

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మే 1 నుంచి 31 తేదీ వరకు ఈ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల క్రీడా సంఘాలు, పీడీలు, పీఈటీల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆసక్తి గలవారు ఈనెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను కలెక్టరేట్లో సమర్పించాలని తెలిపారు.
News April 11, 2025
అమ్రాబాద్: సళేశ్వరానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై హెచ్చరిక

సళేశ్వరం లింగమయ్య జాతర నేటి నుంచి 13 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికారులు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. రాకపోకలు, మెడికల్ సదుపాయాలు, శుద్ధి చర్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తూ, గుండె సంబంధిత సమస్యలున్న భక్తులు శరీరాన్ని ఒత్తిడికి గురిచేయకుండా విశ్రాంతిగా యాత్ర చేయాలని సూచిస్తున్నారు. అధిక రద్దీ సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 11, 2025
వరంగల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం

వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ, సహకార శాఖల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, హార్వెస్టింగ్ యజమానులతో అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సత్యశారద దేవి పాల్గొని 2024-2025 రబీ(యాసంగి) సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి ఉన్నారు.