News November 22, 2025
మహబూబాబాద్‌లో ఆయనది చెరగని ముద్ర !

సుధీర్ రామ్నాథ్ కేకన్ మహబూబాబాద్ జిల్లా వాసులకు సుపరిచితమైన పేరు. విపత్కర పరిస్థితుల్లో నేనున్నానంటూ భరోసా అందించిన ఎస్పీ సుధీర్.. జిల్లాలో సామాన్యుల పట్ల చూపిన ఔదార్యంతో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రధానంగా జిల్లా రైతాంగం యూరియా కోసం, తీర్థ ఇబ్బందులు పడిన సమయంలో తనదైన నేర్పుతో సమస్యను సునాయాసం చేశారు. వృత్తిపరంగా బదిలీపై వెళ్లినప్పటికీ వ్యక్తి పరంగా సామాన్యుల హృదయంలో నిలిచిపోయారు.
Similar News
News November 23, 2025
ప్రతి ఇంటికి బైక్ ఉండాలన్నదే నా లక్ష్యం: విజయ్

వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యమని TVK పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఆయన తొలిసారిగా కాంచీపురం సభలో మాట్లాడారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. DMK తమకు రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విజయ్ ఆరోపించారు.
News November 23, 2025
జగిత్యాలలో ప్రశాంతంగా ఎస్‌ఎంఎంఎస్ పరీక్షలు

జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో ఎస్‌ఎంఎంఎస్ (SMMS) పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు అర్హులైన 1,474 మంది విద్యార్థుల్లో 1,416 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎటువంటి అంతరాయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 23, 2025
SRSPకి భారీగా తగ్గిపోయిన ఇన్ ఫ్లో

SRSPలోకి ఇన్ ఫ్లో భారీగా తగ్గిపోయింది. గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 1,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం తెలిపారు. సరస్వతీ కెనాల్‌కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీరు వదిలామన్నారు. కాగా ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.


