News December 18, 2025
మహబూబాబాద్‌లో ఎక్కువ.. ములుగులో తక్కువ!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 88.52 శాతం పోలింగ్‌తో మహబూబాబాద్ ముందు వరుసలో ఉంది. జనగామ 88.48%, వరంగల్ 88.21%, హనుమకొండ 86.45%, భూపాలపల్లిలో 84.02%, ములుగులో 83.88% పోలింగ్ నమోదు అయ్యింది. 24 మండలాల్లో జరిగిన 3వ విడతలో 6.28 లక్షల ఓటర్లుండగా, వారిలో 5.75 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Similar News
News December 18, 2025
GPay సొంత క్రెడిట్ ఎకోసిస్టమ్.. CCతో స్టార్ట్

క్రెడిట్‌లో ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్‌కే పరిమితమైన GPay సొంత క్రెడిట్ ఎకోసిస్టమ్ నిర్మిస్తోంది. అందులో భాగంగా Axis Bankతో కలిసి కోబ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ సేవలు మొదలుపెట్టింది. పేమెంట్‌కు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రివార్డ్స్ ఇస్తోంది. క్రెడిట్ లైన్‌లో తొలి అడుగు వేసిన GPay తన భారీ యూజర్ నెట్వర్క్‌ను ఇవి మరింత యాక్టివ్ చేస్తాయని భావిస్తోంది. HDFCతో ఫోన్ పే ఇప్పటికే ఈ తరహా సర్వీస్ ఇస్తోంది.
News December 18, 2025
అమరావతి: పేరుకే రాజధాని.. అంబులెన్స్ రావాలంటే కష్టమే!

అమరావతి రాజధాని ప్రాంతంలో అంబులెన్స్ కొరత తీవ్రంగా వెంటాడుతుంది. రాజధాని ప్రాంతంలో రోజూ ఏదొక ప్రమాదం జరుగుతూ ఉన్నా అంబులెన్స్ మాత్రం అందుబాటులో ఉండకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణ బుధవారం రాత్రి రాయపూడిలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడం. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే గుంటూరు, మంగళగిరి నుంచి రావడానికి గంటకు పైగా పడుతుందని స్థానికులు అంటున్నారు.
News December 18, 2025
NGKL: అందరి సహకారంతో ఎన్నికలు విజయవంతం

అందరి సహకారంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన రాజ్యలక్ష్మితో పాటు జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు తదితరులను వారు అభినందించారు. వారికి శాలువా కప్పి సన్మానం చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడం అభినందనీయమని కొనియాడారు.


