News March 19, 2025
మహబూబాబాద్‌లో జాబ్ మేళా

ముతూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ కంపెనీ, మహబూబాబాద్ బ్రాంచ్‌లో ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ అధికారి పోస్టుకు మార్చ్ 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజిత ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్/డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జిల్లా ఉపాధి కార్యాలయంలో మార్చ్ 20న ఉ.10:30 నుంచి మ.2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 11, 2026
VZM: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

మార్చి 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత కోరారు. బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో జిల్లా కోర్టులో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు అన్ని సివిల్ దావాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు డబ్బు, సమయం వృధా కాకుండా చూడాలన్నారు.
News February 11, 2026
మంచిర్యాలలో మధ్యాహ్నం 3గంటల వరకు 58.95% పోలింగ్

జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 58.95% పోలింగ్ జరిగింది. కార్పొరేషన్‌లో 54.64%, బెల్లంపల్లిలో 64.51%, చెన్నూరులో 70.02%, కేతనపల్లిలో 67.98%, లక్షెట్టిపేటలో 69.58% పోలింగ్ జరిగింది.
News February 11, 2026
జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఓటేశారంటే..?

జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 1,40,869 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి మున్సిపాలిటీలో 9,547 మంది, జగిత్యాల మున్సిపాలిటీలో 55,795 మంది, కోరుట్ల మున్సిపాలిటీలో 39,111 మంది, మెట్ పల్లి మున్సిపాలిటీలో 28,075 మంది, రాయికల్ మున్సిపాలిటీలో 8,341 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనున్నది.


