News January 8, 2026
మహబూబాబాద్ ఆసుపత్రిలో సైకో వీరంగం

మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో గురువారం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తులతో హల్‌చల్ చేశాడు. వైద్యం కోసం వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా సైకోలా మారి ఆసుపత్రిలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, కత్తితో పొడుస్తానంటూ రోగులను బెదిరించాడు. దీంతో రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి గొంతు కోసుకోవడానికి ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగలగొట్టి అతడిని బంధించారు.
Similar News
News January 9, 2026
SLBC: ఇకపై డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో తవ్వకం

TG: SLBCలో టన్నెల్ బోరింగ్ మెషీన్‌ను ఎట్టకేలకు తొలగించారు. బేరింగ్ రిపేర్ కారణంగా 2023 నుంచి ఔట్‌లెట్ వైపు టన్నెల్ తవ్వకం నిలిచిపోయింది. సుమారు నెలపాటు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి మెషీన్‌ను బయటికి తీశారు. ఇక ఇన్‌లెట్ వైపు గతంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 8 మంది మరణించగా అందులో ఆరుగురి మృతదేహాలు లభించలేదు. దీంతో ఇకపై డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలోనే తవ్వకం చేపట్టనున్నారు.
News January 9, 2026
HYD: దట్టమైన మంచు మృత్యువుకు ముసుగు: సీపీ

సంక్రాంతి ప్రయాణాల నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. దట్టమైన పొగమంచు మృత్యువుకు ముసుగులా మారిందని, తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో వాహనాలతో సాహసం చేయొద్దని హెచ్చరించారు. పొగమంచు తగ్గాకే ప్రయాణం మొదలుపెట్టాలని, డ్రైవింగ్ సమయంలో ఫాగ్ లైట్లు, ఇండికేటర్లు వాడాలని సూచించారు. ‘ఆలస్యంగానైనా సరే.. క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ’ అని ట్వీట్ చేశారు.
News January 9, 2026
డీజీపీ శివధర్‌రెడ్డి నియామకంపై ఇవాళ హైకోర్టు తీర్పు

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. డీజీపీ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం జాబితాను ఆలస్యంగా పంపడంతో యూపీఎస్సీ తిరిగి పంపిందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న అనంతరం ధర్మాసనం విచారణను నేటికి వాయిదా వేసింది.


