News November 15, 2025

మహబూబాబాద్: ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

image

విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. MHBD పట్టణం కంకర బోర్డులోని జడ్పీ హై స్కూల్లో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న రవి 10 రోజులుగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లితో చెప్పింది. ఆమె ఫిర్యాదుతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Similar News

News November 15, 2025

సూర్యాపేటలో ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

దురాజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివ్వెంల పోలీసులు, రహదారి సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేసే పనిలో ఉన్నారు.

News November 15, 2025

జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

image

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.

News November 15, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.