News March 1, 2025
మహబూబాబాద్: ఎగ్ పఫ్ తింటున్నారా.. జర జాగ్రత్త..!

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బానోతు దేవేందర్ ఫిర్యాదు మేరకు బ్రహ్మ లింగేశ్వర బేకరీని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బేకరీలో ఎగ్ పఫ్‌లో అధికంగా ప్లాస్టిక్ ఉందని దేవేందర్ ఫిర్యాదు చేయగా అధికారి తనిఖీలు చేసి నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2025
నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
News March 1, 2025
కేజ్రీవాల్ రావణుడు, ఆతిశీ శూర్పణఖ: BJP MLA

కేజ్రీవాల్, ఆతిశీని ఢిల్లీ BJP MLA గజేంద్ర యాదవ్ రావణుడు, శూర్పణఖతో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు హతమవుతారు. కానీ శూర్పణఖ బతికిపోతుంది. ఇక్కడ కూడా ఓటమితో కేజ్రీవాల్, సిసోడియా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. కానీ ఆతిశీ గెలిచారు. అందుకే ఆమె శూర్పణఖ లాంటివారు’ అని ఎద్దేవా చేశారు. ఇక తాము చేసే మంచిని చూసి ఆప్ నేతలెప్పుడూ ఏడుస్తూనే ఉంటారని ఆయన విమర్శించారు.
News March 1, 2025
NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

మార్చ్ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.