News January 7, 2026

మహబూబాబాద్ కలెక్టర్‌కు పొంగులేటి డోస్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ పనితీరు కారణంగానే నిత్యం వార్తల్లో మహబూబాబాద్ ఉంటుంది’ అని క్లాస్ పీకారు.

Similar News

News January 8, 2026

విశాఖలో రేపు డీఆర్సీ సమావేశం

image

విశాఖలో డీఆర్సీని జనవరి 9న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ సమీక్షలో పాల్గొననున్నారు. పక్కా నివేదికలతో అధికారులు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలన్నారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సమాధానం ఇచ్చేలా ఉండాలని సూచించారు.

News January 8, 2026

ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ప్రసారభారతి<<>> 14 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MBA/MBA(మార్కెటింగ్) పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల వారు JAN 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 35ఏళ్ల లోపు ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. చెన్నై, HYD, ముంబై, కోల్‌కతాలో ఉద్యోగాలకు నెలకు రూ.35K- రూ.50K, మిగతా సిటీ ఉద్యోగాలకు రూ.35K- రూ.42K చెల్లిస్తారు. https://prasarbharati.gov.in

News January 8, 2026

ఖమ్మం:​ చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త.!

image

సోషల్ మీడియాలో చిన్న పిల్లల అశ్లీల(చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను చూస్తూ, ఇతరులకు షేర్ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వి.నిరంజన్ కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని సీపీ హెచ్చరించారు.