News September 6, 2025
మహబూబాబాద్: కురవిలో విషాదం

కరెంట్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి అనే రైతు తన వ్యవసాయ మోటార్ రిపేర్ కోసం దగ్గరలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 7, 2025
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2025 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇండియా

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–2025 పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనడానికి 16-25 ఏళ్ల యువత అర్హులన్నారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఎస్ఐడీహెచ్ పోర్టల్ లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News September 7, 2025
ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగాలు: మంత్రి లోకేశ్

AP: సీడాప్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 50 వేల మందికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే నైపుణ్యం పోర్టల్‌ను ప్రారంభిస్తామన్నారు. అంతర్జాతీయ ప్లేస్ మెంట్ పథకం కింద జర్మనీ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అభినందించారు. తొలి బ్యాచ్‌లో సీడాప్ ద్వారా మొత్తం 171 మందికి శిక్షణనివ్వగా, ఇప్పటికే వివిధ విభాగాల్లో 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.
News September 7, 2025
రాబోయే 2 గంటల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఉమ్మడి కరీంనగర్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ములుగు, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.