News February 1, 2025
మహబూబాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోయే గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. మండలస్థాయిలో అందుబాటులో ఉన్న సిబ్బంది ఎన్నికల సమయంలో ఏ బాధ్యతలను నిర్వర్తించాలో స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
Similar News
News February 1, 2025
భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు
దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.
News February 1, 2025
కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల
AP: బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్‌కు బడ్జెట్‌లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్‌ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.
News February 1, 2025
విధులపై అవగాహన కలిగి ఉండాలి: SKLM ఎస్పీ
శ్రీకాకుళం పట్టణంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఆదిత్యుని రథసప్తమి వేడుకలు బందోబస్తు విధులపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో రథసప్తమి వేడుకల బందోబస్తుకు సంబంధించి బందోబస్తు, ట్రాఫిక్, వాహనాల పార్కింగ్, భక్తుల దర్శనం, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై సెక్టార్ వారీగా పోలీసు అధికారులతో సమీక్షించారు.