News February 8, 2025

మహబూబాబాద్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

Similar News

News September 15, 2025

బాపట్ల ఎంపీకి 5వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!

News September 15, 2025

కాంగ్రెస్‌తో పొత్తుకు తేజస్వీ బ్రేక్!

image

జాతీయ స్థాయిలో కూటమిగా ఉంటూ రాష్ట్ర ఎన్నికల్లో వేరుగా పోటీ చేసేందుకు ఇండీ కూటమి పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. బిహార్‌లో ఉన్న 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ఇండీ కూటమిలోని RJD ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో తేజస్వీ కాంగ్రెస్‌తో పొత్తుకు బ్రేక్ ఇచ్చారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో పంజాబ్, హరియాణా ఎన్నికల్లో ఆప్, పశ్చిమబెంగాల్‌లో TMC ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

HYD: గొర్రెల స్కామ్‌‌ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

image

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.