News July 9, 2025

మహబూబాబాద్ జిల్లాకు 8 సబ్ స్టేషన్లు మంజూరు

image

జిల్లాలో వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా 8 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని, సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు.

Similar News

News July 9, 2025

10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.

News July 9, 2025

కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ థియరీ (వన్ టైమ్ ఆపర్చునిటీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 14 నుంచి 25 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కేఆర్‌యూ వర్గాలు తెలిపాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 6వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

News July 9, 2025

కోస్గి: ‘భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి’

image

కోస్గి, గుండుమల్, కొత్తపల్లి మండలాల్లో నిర్మాణంలో ఉన్న మండల కాంప్లెక్స్, జూనియర్ కళాశాల, ఇతర ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా మండలాల్లో ఆమె పర్యటించారు. నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు మండలాల తహశీల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.