News September 3, 2025
మహబూబాబాద్ జిల్లాలో తగ్గిన వర్షపాతం

గత కొన్ని రోజుల నుంచి MHBD జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 8:30 గం. వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గార్ల 4.8మి.మీ, బయ్యారం 1.4, నెల్లికుదురు 3.0, మరిపెడ 3.8, దంతాలపల్లి 2.6, తొర్రూర్ 1.6, పెద్ద వంగర 1.2, మొత్తంగా 18.4 మి.మీ.గా నమోదైంది.
Similar News
News September 4, 2025
కామారెడ్డి: వరద నష్టంపై సీఎంకు కలెక్టర్ ప్రజెంటేషన్

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. IDOCలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంటలు, రోడ్లు, ఇళ్లు, ఇతర మౌలిక వసతులకు జరిగిన నష్టాలను వివరించారు. వర్షాల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన అంచనాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా అందజేశారు.
News September 4, 2025
నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: ఖమ్మం సీపీ

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో (సెప్టెంబర్-6) శనివారం వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు.
News September 4, 2025
NRPT: నామినేషన్ ప్రక్రియపై అవగాహన

నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ల ప్రక్రియపై జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సంబంధిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్ తెలిపారు. 2025 2026 విద్యా సంవత్సరానికి గానీ ఇన్స్పైర్ అవార్డుల కోసం https://www.inspireawards-dst.govt.in వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు. పాఠశాలకు 5 నామినేషన్లు నమోదు చేయాలన్నారు.