News December 17, 2025

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం

image

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. డోర్నకల్ 30.42, గంగారం 24.09, కొత్తగూడ 27.32, కురవి 26.74, మరిపెడ 25.74, శిరోల్ 30.74, మొత్తంగా 27.49 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

విశాఖలో పొగమంచు.. ఉమెన్స్ టీమ్ ఫ్లైట్ డైవర్ట్

image

దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయల్దేరిన ఫ్లైట్‌ను పూర్ విజిబిలిటీ కారణంగా విజయవాడకు డైవర్ట్ చేశారు. ఈ నెల 21, 23 తేదీల్లో శ్రీలంకతో మ్యాచ్‌ల కోసం మహిళా జట్టు విశాఖకు వెళ్లాల్సి ఉంది. అటు విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన మరో విమానం కూడా పొగమంచు కారణంగా క్యాన్సిల్ అయింది.

News December 17, 2025

చేసే పనిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి: సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులకు CM దిశానిర్దేశం చేశారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా ఉంటారని తెలిపారు. మనం ఏం చేశామనే వివరాలు సమగ్రంగా ఉండాలని, నిరంతరం నేర్చుకునే పనిలో ఉండాలని అన్నారు. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా కృషి చేయాలని, జవాబుదారీతనం ఉండాలని పిలుపునిచ్చారు.

News December 17, 2025

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు!

image

TG: పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో పరిషత్(MPTC, జడ్పీ) ఎలక్షన్స్‌కు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ ఫైల్‌ను అధికారులు సీఎంకు పంపారు. రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పంచాయతీ తరహాలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. సీఎం ఆమోదిస్తే ఈ నెల 25లోపు షెడ్యూల్ విడుదల, JANలో ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.