News February 13, 2025
మహబూబాబాద్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739411526628_1047-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 13, 2025
తాడిపత్రిలో శివలింగం కింద నీటిని ఎప్పుడైనా చూశారా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425630265_727-normal-WIFI.webp)
అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.
News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. వైసీపీ సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739425460289_1127-normal-WIFI.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఉదయం ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఆయనకు మద్దతుగా #WE STAND WITH VALLABHANENI VAMSI’ అంటూ హాష్ ట్యాగ్‌ను Xలో వైరల్ చేస్తోంది.
News February 13, 2025
SnapChatలో రికార్డు సృష్టించారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739421580938_746-normal-WIFI.webp)
మీరెప్పుడైనా స్నాప్‌చాట్ వాడారా? అందులో ఇద్దరు స్నేహితులు కలిసి స్నాప్ పంపించుకుంటే స్ట్రీక్ స్టార్ట్ అవుతుంది. రోజూ ఒక స్నాప్ (ఫొటో/వీడియో) పంపిస్తుంటే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఇలా కాటీ &ఎరిన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ 3662+ స్ట్రీక్‌తో రికార్డు సృష్టించారు. అంటే వీరి స్నాప్ జర్నీ పదేళ్లు దాటిందన్న మాట. వీరి తర్వాత లెస్లీ & జయ్నబ్ (3536+), ఎర్మిరా & జవి (3528+) ఉన్నారు. మీ హైయెస్ట్ స్ట్రీక్స్ ఎంత?