News March 5, 2025

మహబూబాబాద్ జిల్లాలో మండుతున్న ఎండ!

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 34 నుంచి 37 డిగ్రీలతో పాటు.. మేఘావృతమై ఉంటుందని, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.

Similar News

News March 3, 2026

బోసిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్.. కేవలం 20 విమానాలే..

image

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యుద్ధ ప్రభావంతో బోసిపోయింది. మార్చి 2న ‘ఫ్లైట్ రాడార్24’ ట్రాకింగ్ ప్రకారం 20 విమానాలు మాత్రమే ఈ విమానాశ్రయంలో రాకపోకలు సాగించాయి. అందులో 16 టేకాఫ్ కాగా 4 ల్యాండ్ అయ్యాయి. సాధారణ సమయాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి రోజుకు 1,200కు పైగా విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతాయి. ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే విమానాలకు ఇదే కనెక్టింగ్ పాయింట్.

News March 3, 2026

తిరుపతి: ఆ టీచర్లకు డ్యూటీలు ఎవరు వేసినట్లు..?

image

తిరుపతి జిల్లాలో ఒకేషనల్ ఇన్స్‌స్టెక్టర్స్, పీఈటీలు 330 మందిని ఇంటర్ ఇన్విజిలేటర్లుగా నియమించారు. కమిషనర్ ఆదేశాల మేరకు డ్యూటీలు వేశామని డీఈవో కుమార్ చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్ అసిస్టెంట్ల(SA)ను సైతం ఇన్విజలేటర్లుగా వాడుతున్నారు. విద్యాశాఖ అధికారులకు తెలియకుండా ఇలా జరుగుతుందని సమాచారం. విద్యాశాఖ ఇచ్చిన వారినే తీసుకున్నట్లు ఆర్ఐవో చెబుతున్నారు. మరి SAలకు ఎవరు విధులు కేటాయించారు?

News March 3, 2026

కాకినాడ జిల్లాలోని పాఠశాలలకు కొత్త ట్యాబ్స్‌

image

కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నూతన ట్యాబ్స్‌ను మంజూరు చేసింది. గతంలో ‘పాల్‌ ల్యాబ్స్‌’లో ఉన్న ట్యాబ్స్‌ పని చేయకపోవడంతో, వాటి స్థానంలో 630 కొత్త ట్యాబ్స్‌ మంగళవారం జిల్లాకు చేరుకున్నాయి. 21 ల్యాబ్స్‌కు వీటిని పంపిణీ చేయనున్నట్లు డీఎన్ఓ పి.రాంబాబు తెలిపారు. డీఈవో, ఏపీసీ ఆదేశాల మేరకు వీటిని పాఠశాలలకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.