News December 12, 2025

మహబూబాబాద్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

జిల్లాలో 155 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.99 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

Similar News

News December 12, 2025

చిత్తూరు: ఘోరం బస్సు ప్రమాదంపై మరిన్ని వివరాలు.!

image

చిత్తూరుకు చెందిన ప్రైవేట్ బస్సు ఇవాళ అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ప్రమాదానికి గురైన బస్సు ఈ నెల 6వ తేదీన తీర్థయాత్రల కోసం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం వద్ద బయలుదేరినట్లు తెలుస్తోంది. వీరు భద్రాచలంలో స్వామి వారిని దర్శించుకుని అన్నవరం వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News December 12, 2025

ఘోర ప్రమాదానికి కారణాలేంటి?

image

AP: అల్లూరి(D)లో జరిగిన బస్సు <<18539495>>ప్రమాదానికి<<>> గల కారణాలపై పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్‌కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా? దట్టమైన పొగమంచుతో దారి కనిపించలేదా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో బాధితులు 108కి ఫోన్‌ చేయడం ఆలస్యమైంది. అంబులెన్సులు ప్రమాదస్థలికి వెళ్లడంలోనూ లేటయ్యింది.

News December 12, 2025

రాజమండ్రి: పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడని హత్య.. జైలు

image

కడియానికి చెందిన రాయ వెంకన్న, నల్లి శేఖర్‌లకు 7 సం.లు జైలు శిక్ష, రూ. 5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబర్లో కడియం (M) M. R పాలేనికి చెందిన శీలం సంతోశ్ (13) మోటారు సైకిళ్లలో పెట్రోల్ చోరీ చేస్తున్నాడనే నెపంతో వెంకన్న, శేఖర్ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై జిల్లా జడ్జి గంధం సునీత శిక్ష ఖరారు చేశారు.