News February 28, 2025
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం మండలం రంగాపురం గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీని కలెక్టర్ పరిశీలించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మిషన్ భగీరథ ఈఈ లక్ష్మారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
Similar News
News February 28, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందన్న వార్తలను నిర్మాత నాగవంశీ ఖండించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ఆ ప్రాజెక్టు ఈ ఏడాది సెకండాఫ్‌లోనే స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 తర్వాత బన్నీ సినిమా ఏదీ ఇంకా మొదలవని విషయం తెలిసిందే.
News February 28, 2025
బిక్కనూర్: వసతి గృహంలో కలెక్టర్ బస

బిక్కనూర్ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అందుతున్న సేవలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, విద్యార్థులతో కలిసి బస చేశారు.
News February 28, 2025
తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ స్పోర్ట్స్ కోటాలో TTDలో ఉద్యోగాల భర్తీకి చర్యలు
✒ తిరుపతిలో అర్ధరాత్రి బ్యూటీపార్లర్‌లో అగ్ని ప్రమాదం
✒ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి హన్సికా
✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి MP విమర్శలు
✒ తిరుపతి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ ఈవో
✒ శ్రీకాళహస్తి RDO ఆఫీస్ వద్ద ధర్నా