News March 18, 2025

మహబూబాబాద్‌: నిలిచిన పలు రైళ్లు..!

image

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News December 29, 2025

ప్రజల్లో విశ్వాసం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.

News December 29, 2025

NCDCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NCDC) 4యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA-ఇంటర్మీడియట్, ICWA-ఇంటర్మీడియట్, ఎంకామ్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం రూ.25,000-రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncdc.in

News December 29, 2025

బాపట్ల: ‘ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజలు వారి సమస్యలను అర్జీలరూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.