News March 5, 2025

మహబూబాబాద్: నేడే పరీక్షలు.. ALL THE BEST

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,302 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 4,392, సెకండియర్‌లో 4,910 మంది విద్యార్థులు రాయనుండగా.. 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST

Similar News

News September 14, 2025

విమానాశ్రయం ద్వారా ఎంతమంది ప్రయాణించారంటే.?

image

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా శనివారం 44 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 22 సర్వీసుల ద్వారా 1,566 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,880 మంది 22 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.

News September 14, 2025

నేడు మళ్లీ చర్చలు.. విఫలమైతే కాలేజీలు బంద్

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇనిస్టిట్యూషన్స్(FATHI) రేపటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీల <<17690252>>బంద్‌కు<<>> పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిధుల విడుదలపై నిన్న Dy.CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో FATHI జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇవాళ మరోసారి మీటింగ్ జరగనుంది. సయోధ్య కుదరకపోతే రేపటి నుంచి ప్రొఫెషనల్ కాలేజీలు, 16 నుంచి డిగ్రీ, PG కాలేజీలు బంద్ చేసే అవకాశముంది.

News September 14, 2025

HYD: కృష్ణా జలాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

image

సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించే వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ వోహ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.