News February 27, 2026
మహబూబాబాద్: ఫార్మర్ రిజిస్ట్రీ 60.10 శాతం

కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) సరిత సూచించారు. ఈ నెల 28తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,12,827 పాస్ బుక్కులు ఉండగా, ఇప్పటి వరకు 1,27,900 (60.10%) నమోదు పూర్తయ్యాయని తెలిపారు.
Similar News
News February 27, 2026
NCERT బుక్‌లో ఏముంది?

‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంలో సుప్రీంకోర్టులో 81వేలు, హైకోర్టుల్లో 62 లక్షలు, జిల్లా, కింది కోర్టుల్లో 4.70 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని <<19224324>>NCERT<<>> పేర్కొంది. జడ్జిల కొరత, మౌలిక సౌకర్యాలు లేమి, సంక్లిష్టమైన న్యాయప్రక్రియలే దీనికి కారణమని తెలిపింది. న్యాయమూర్తులకూ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందని.. 2017-21 మధ్య వారిపై 1,600 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. కాగా దీనిని CJI <<19243239>>బ్యాన్<<>> చేశారు.
News February 27, 2026
ఆదిలాబాద్: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 491 గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా మొత్తం 9,226 మంది విద్యార్థులకు 8,735 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 8,204 మందికి 366 మంది విద్యార్థులు, వొకేషనల్ విభాగంలో 1,022 విద్యార్థులకు 125 మంది విద్యార్థులు, మొత్తం 491 మంది ఎగ్జామ్‌కు గైర్హాజరైనట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ వెల్లడించారు.
News February 27, 2026
NTR: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ (MEP సర్వీసెస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పై అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.


