News February 25, 2026

మహబూబాబాద్ బస్టాండ్‌లో భారీ చోరి

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ.7 లక్షల విలువైన 41/2 తులాల బంగారు, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగును దుండగులు అపహరించారని బాధితులు వాపోయారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు దోచుకుపోయారు.

Similar News

News February 27, 2026

హోలీ పండుగ రద్దీ దృష్ట్యా విశాఖ- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం – పాట్నా మధ్య రెండు ప్రత్యేక రైళ్లను (08537/08538) నడపాలని వాల్తేరు రైల్వే విభాగం నిర్ణయించింది. మార్చి 1, 8 తేదీల్లో విశాఖ నుంచి, మార్చి 2, 9 తేదీల్లో పాట్నా నుంచి ఈ రైళ్లు బయలుదేరుతాయి. విజయనగరం, బొబ్బిలి, రాయగడ మీదుగా నడిచే ఈ రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ కోరారు.

News February 27, 2026

చిన్నగంజాంలో విద్యుత్ షాక్‌కి గురై వ్యక్తి మృతి

image

చిన్నగంజాంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఉప్పు కొట్టారులో పనిచేస్తున్న పలబోలు శ్రీకాంత్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. తన సొంత ఉప్పు కొట్టారులో మోటార్ వద్ద కరెంట్ వైర్ బిగించే సమయంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలినట్లు సమాచారం. మృతుడికి భార్యతో పాటు పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో సోపిరాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 27, 2026

ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయండి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణమే సవరణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేయాలన్నారు. రోడ్లపై పశువుల సంచారం విచ్చలవిడి కావడంతో ప్రమాదాలు జరుగుచున్నాయని, యజమానులకు అవగాహన కల్పించాలన్నారు.