News September 21, 2025

మహబూబాబాద్: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు అందరూ యూరియా పంపిణీ కార్యక్రమంలో భాగమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున, జిల్లా ప్రజల వారు రేపు కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

Similar News

News September 21, 2025

మెదక్: ‘అమెండ్‌మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలి’

image

ఇన్ సర్వీస్ టీచర్స్‌కి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా NCTE నిబంధనలు అమెండ్ మెంట్ ఉత్తర్వులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి MLC శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు PRTU TS విజ్ఞప్తి చేసినట్లు అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, సర్వీస్ రూల్స్ అమలుపరిచేలా తగిన సహకారం అందించాలన్నారు.

News September 21, 2025

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

image

మందస మండలం కొర్రాయిగేట్ సమీపంలో NH16 రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని శ్రీకాకుళం RIMS హాస్పిటల్‌లో మార్చురీ గది వద్ద ఆచూకీ కోసం ఉంచారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు మందస స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.

News September 21, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.