News February 17, 2025
మహబూబాబాద్: రేపు జిల్లా వ్యాప్తంగా సీపీఐ నిరసనలు: విజయ్ సారథి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని మండల కేంద్రాల్లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ సారధి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమను స్థాపించకుండా తాత్సారం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో అమలు చేయడంలేదన్నారు.అందుకు రేపు జిల్లాలో నిరసనలు చేపడుతున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిరసనలో పాల్గొనాలన్నారు.
Similar News
News November 7, 2025
జిల్లాలో పెరుగుతున్న చలి పులి..!

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా మన్నెగూడెంలో 17.4℃, గోవిందారం 17.6, కథలాపూర్ 17.8, గోల్లపల్లి, రాఘవపేట 18.0, మల్లాపూర్ 18.1, పెగడపల్లె, నేరెళ్ల, జగ్గసాగర్ 18.3, తిరుమలాపూర్, మేడిపల్లె, సారంగాపూర్, పూడూర్, ఐలాపూర్ 18.4, జగిత్యాల 18.9, మెట్‌పల్లి 19.3, ఎండపల్లి, సిరికొండ, గుల్లకోటలో 19.9℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
News November 7, 2025
జగిత్యాల: జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం

అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం వందేమాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వందేమాతరం సామూహిక గేయ ఆలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీఖాన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సైదులు, వేణు, పోలీస్ అధికారులు, తదితర సిబ్బంది పాల్గొని వందేమాతరం గేయాన్ని ఆలపించారు.
News November 7, 2025
ఈనెల 12న RUకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక: వీసీ

ఈ నెల 12న రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 4వ కాన్వకేషన్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ వెంకట బసవరావు వెల్లడించారు. శుక్రవారం యూనివర్సిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీలో 75 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, 283 మంది స్కాలర్లకు కాన్వకేషన్ పట్టాలు, 18,396 మందికి ఓడీ ప్రదానం చేయనున్నారని పేర్కొన్నారు.


