News March 8, 2026
మహబూబాబాద్: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్ల ప్రదానం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ చట్టం అమలులో భాగంగా ఆరు నెలలుగా కఠిన శిక్షణ, అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శనివారం లైసెన్స్ సర్టిఫికెట్లను అందజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ నూర్ సింగ్ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. భూ సర్వే ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఈ లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
వనపర్తి: కరెంట్ షాక్‌తో రైతు మృతి

ఏదుల మండలం గుండ్యవాల్య నాయక్ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాట్రావత్ లోకేష్ (45) వ్యవసాయ పొలం వద్ద ఈరోజు ఉదయం 6:30కు కరెంట్ షాక్‌తో మరణించారు. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు బీజేపీ నేత తిరుపతి నాయక్ తెలిపారు. ఏడాది క్రితం వరకు ఆయన పోస్ట్ మెన్‌గా పనిచేశారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2026
VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News April 5, 2026
దళిత బంధు పథకం జగ్జీవన్ రామ్ ఆలోచనల ప్రతిఫలం: కేసీఆర్

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, మాజీ ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలను స్మరించారు. సామాజిక న్యాయం, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గొప్పదన్నారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి దేశ ప్రగతికి కృషి చేశారని పేర్కొన్నారు. దళిత సాధికారతకు దళిత బంధు వంటి పథకాలు ఆయన ఆలోచనల స్ఫూర్తితోనే అమలవుతున్నాయన్నారు.


