News June 21, 2024

మహబూబాబాద్: విధుల్లో మద్యం తాగిన ఉద్యోగి సస్పెండ్

image

ఆర్టీఏలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ అసిస్టెంట్ సురేశ్ విధుల్లో నిర్లక్ష్యంగా మద్యం తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సదరు ఉద్యోగి సురేశ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించకుండా బ్లాక్ లిస్టులో ఉంచామన్నారు.

Similar News

News October 7, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఈరోజు ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గత వారంలో క్వింటా పత్తి రూ.7,450 పలకగా నేడు రూ.7550 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

News October 7, 2024

వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్ జిల్లాలో 325, హనుమకొండ- 208, మహబూబాబాద్-461, జనగామ-283, ములుగు -174, భూపాలపల్లి – 240 గ్రామ పంచాయతీలున్నాయి.

News October 7, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..

image

> MHBD: దక్షిణాఫ్రికాలో మెరిసిన జిల్లా అమ్మాయి
> MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
> WGL: కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
> JN: ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు
> HNK: జిల్లాలో ఘనంగా దాండియా వేడుకలు
> BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: MLA
> HNK: వృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి: ఎంపీ