News December 14, 2025
మహబూబాబాద్: @11AM.. 1,18,708 ఓట్లు నమోదు

మహబూబాబాద్ జిల్లాలో రెండో విడతలోని 7 మండలాల్లో ఉదయం 11 గంటల వరకు 1,18,708 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా… బయ్యారంలో 21,210, చిన్నగూడూరులో 7,411, దంతాలపల్లిలో 17,297, గార్లలో 15,559, నరసింహులపేటలో 15,722, పెద్దవంగరలో 14,911, తొర్రూరులో 26,598 ఓట్లు నమోదయ్యాయి. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Similar News
News December 15, 2025
నల్గొండ: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం..!

నల్గొండ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు దేవరకొండ డివిజన్‌లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. డివిజన్‌లోని మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 42 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 227 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థుల భవిత్యం తేలనుంది. మొత్తం 2,81,321 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
News December 15, 2025
‘ఇంధన పొదుపులో మెరుగైన ఫలితాలు’

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న ఇంధన పరిరక్షణ పథకాల ద్వారా ఏటా 53.60 మిలియన్ టన్నుల చమురు సమాన ఇంధన పొదుపు సాధ్యమైందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ తెలిపారు. ఏపీలో ఈ పథకాల అమలుపై రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పొదుపు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
News December 15, 2025
మాంసాహారం తిని గుడికి వెళ్లవచ్చా?

మాంసం తిని గుడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. అందులో ఉండే తమో, రజో గుణాలు మనలో నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయని, తద్వారా పూజా ఫలితం దక్కదని అంటున్నారు. అందుకే గుడికి వెళ్లేటప్పుడు, దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం గుడ్లు కూడా ముట్టుకోవద్దంటున్నారు. అయితే సంపూర్ణ పూజా ఫలం దక్కాలంటే.. ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు లేని ఆహారాన్నే స్వీకరించాలని సూచిస్తున్నారు.


