News April 9, 2025
మహబూబాబాద్: GREAT.. వీధిలైట్ల కింద చదువుకుంటున్న విద్యార్థి

వీధిలైట్ల కింద చదివి గొప్పవారై అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాశారని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే బయ్యారం మండలంలోని జగ్గు తండాలో సన్నివేశాన్ని కనిపించింది. కరెంటు పోయిన సమయంలో వీధిలైటు కింద కూర్చొని చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని Way2News చిత్రీకరించింది. చదువుపై ఆసక్తి ఉంటే ఎక్కడైనా, ఎలాగైనా చదవుకోవొచ్చని, ఈ విద్యార్థి నిరూపించాడు. ఏ స్కూల్ అని అడగగా బయ్యారం ప్రభుత్వ హైస్కూల్ అని సమాధానం ఇచ్చాడు.
Similar News
News April 17, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.
News April 17, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు..!

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 190 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 164 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.6,639, కనిష్ఠ ధర రూ.5,241 లభించింది. మొక్కజొన్న 2,474 క్వింటాలు అమ్మకానికి రాగా క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,251, కనిష్ఠ ధర రూ.2259, కనిష్ఠ ధర రూ.1,681 లభించింది. వడ్లు ఆర్ఎన్ఆర్ 2004 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠ ధర రూ.2,306 లభించింది.
News April 17, 2025
కోడలిపై అత్త గృహ హింస కేసు పెట్టొచ్చు.. కోర్టు కీలక తీర్పు

అత్తపై కోడలు గృహ హింస కేసు పెట్టొచ్చు. మరి కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న అత్త అలాంటి కేసు పెట్టొచ్చా? ఓ UP మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమవగా జడ్జి కీలక తీర్పునిచ్చారు. ‘కోడలు లేదా కుటుంబసభ్యులెవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు’ అని స్పష్టం చేశారు.