News July 7, 2025
మహబూబ్‌నగర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

నిజాం ఏర్పాటు చేసిన హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ ప్రాంతం ఓ జిల్లా. ఈ ప్రాంతాన్ని గతంలో “రుక్మమాపేట”/ “పాలమురు” అని పిలిచేవారు. అనంతరం 4 డిసెంబర్ 1890న (1869-1911AD) నిజాం మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ జా-VI పాలమూరుకు మహబూబ్‌నగర్‌గా పేరు పెట్టారు. ఒకప్పుడు చోళవాడి” /“చోళుల భూమి” అని పిలిచేవారు. కోహినూర్” డైమండ్‌తో సహా ప్రముఖ “గోల్కొండ వజ్రాలు” జిల్లా నుంచి వచ్చాయని చరిత్రకారులు అభిప్రాయం. దీనిపై మీ కామెంట్..?
Similar News
News July 7, 2025
‘కాంతార చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంతార చాప్టర్-1’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
News July 7, 2025
వరంగల్: వారికి పెన్షన్లు ఎప్పుడు వచ్చెనో..?

ఉమ్మడి జిల్లాలో పలువురు దివ్యాంగులకు ఏళ్ల తరబడి పెన్షన్లు అందడం లేదు. గతంలో జిల్లా స్థాయి మెడికల్ బోర్డులో తిరస్కరించగా.. దానిపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 375, జనగామలో 90 అప్పీళ్లు ఉన్నాయి. HNK, BHPL, WGL, ములుగులోను వంద లోపు అప్పీళ్లు వచ్చాయి. వాటిని పరిష్కరించి, పథకాలకు అర్హులుగా అయ్యేలా చూడాలని దివ్యాంగులు కోరుతున్నారు.
News July 7, 2025
MBNR: ఆ ప్రాంతాల్లో 15 చిరుతల సంచారం.. ప్రజలు అప్రమత్తం

మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ మండలాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 15 చిరుతల మేర సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గాధిర్యాల్ లోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు లావణ్య, శ్రీనివాస్, సిబ్బంది కొణెంగల గుట్టకు వెళ్లి పరిశీలించారు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజ్ అధికారి అబ్దుల్ హై పేర్కొన్నారు.