News October 10, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

Similar News

News February 12, 2026

MBNR: గోల్డ్ మెడల్ సాధించిన శ్రీజ

image

APలోని తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సౌత్ జోన్ షూటింగ్ బాల్‌లో మహమ్మదాబాద్ మండలం మంగంపేటకు చెందిన శ్రీజ అద్భుత ప్రదర్శన కనబరిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఈనెల 7 నుంచి జరిగిన సౌత్ జోన్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని యువతకు స్ఫూర్తిగా నిలిచారు. గోల్డ్ మెడల్ సాధించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉమ్మడి జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 11, 2026

మహబూబ్‌నగర్ జిల్లాలో 69.5% ఓటింగ్ నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పురపాలికలు, 1 నగరపాలికలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 69.05 ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దేవరకద్రలో 85.51 శాతం ఓటింగ్, భూత్పూర్‌లో 84.58 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే మహబూబ్‌నగర్ నగరపాలికలో 67.73% ఓటింగ్ నమోదు అయినట్లు పేర్కొన్నారు.

News February 11, 2026

కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన ఏపీ జితేందర్ రెడ్డి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం 44 డివిజన్ పంచాయితీ రాజ్ కాలనీలోని పోలింగ్ బూత్‌లో ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.