News March 20, 2025
మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News February 23, 2026
పనితీరు మారకుంటే ఇంటికి వెళ్లండి: కలెక్టర్ ఆగ్రహం

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులకు ఆయన సోమవారం క్లాస్ పీకారు. ‘పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోండి’ అని ఘాటుగా హెచ్చరించారు. మెమోలు ఇచ్చినా మార్పు రాకపోవడాన్ని తప్పుబడుతూ, ప్రజల సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News February 23, 2026
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) పేరును మార్చారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా ఛేంజ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి TVVP ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి రానున్నారు. అలాగే హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News February 23, 2026
గద్వాల: గ్రీవెన్స్ డే.. 10 ఫిర్యాదుల స్వీకరణ

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఇందులో మొత్తం 10 ఫిర్యాదులు అందాయి (భూవివాదాలు-3, గొడవలు-3, మోసం-1, ఇతరాలు-3). వీటిని చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.


