News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News November 3, 2025

బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: మేయర్

image

చిన్న వడ్డేపల్లి మత్తడి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం వరంగల్ పరిధి లోని చిన్న వడ్డేపల్లి చెరువు, రామన్న పేట గాంధీ బొమ్మ ప్రాంతంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి నీటిని డక్ట్‌లోకి పంపించాలని అధికారులకు సూచించారు.

News November 3, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

➢ CM రేవంత్‌తో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధుల భేటీ.. ఈ నెల 14న కొడంగల్‌లోని ఎన్కేపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. ఈ కిచెన్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా
➢ ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు కోసం 700 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు
➢ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న CCI నిబంధన ఎత్తివేయాలి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ

News November 3, 2025

పాలిటెక్నిక్‌లో సత్తాచాటిన విద్యార్థినులు

image

ఆదివారం విడుదలైన 1st డి-ఫార్మసీ ఫలితాల్లో హిందూపురం మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. షాజియా భాను 990 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అమీనా త్యాహిమ్ (969), గ్రీష్మ సాయి రెడ్డి (962), సానియా సుల్తానా (962), అమ్రీన్ భాను (943), ఆర్సియా(933) మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.