News February 14, 2026
మహబూబ్‌నగర్‌లో క్యాంప్ రాజకీయాలు..?

మహబూబ్‌నగర్(60)లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్(29) మేయర్ పీఠాన్ని సాధించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 2 సీట్ల దూరంలో నిలిచిన కాంగ్రెస్.. ఇతరులు గెలిచిన 8 డివిజన్లలో కొందరిని క్యాంప్ రాజకీయాలకు తరలించినట్లు సమాచారం. వారు ఈనెల 16న నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుని మేయర్ ఎన్నికను లాంఛనం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా BRS-15, BJP-8, OTH-8 సీట్లు సాధించాయి.
Similar News
News February 15, 2026
భద్రాద్రి: పండుగ పూట విషాదం.. యువకుడి దుర్మరణం

మహాశివరాత్రి పర్వదినాన మణుగూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కట్టు ఉడతనేని గుంపు ప్రాంత శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరుప సుదీర్(21) అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పండుగ పూట చేతికి అందిన కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
News February 15, 2026
జగిత్యాల కళాకారుడి అద్భుత సృష్టి.. సూదిపై శివయ్య విగ్రహం

జగిత్యాల పట్టణానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మహాశివరాత్రి సందర్భంగా తన ప్రతిభను చాటుకున్నారు. బట్టలు కుట్టే సూదిపై 10 గంటల పాటు శ్రమించి, నైలాన్ దారం, పెన్సిల్ రంగులతో అతి సూక్ష్మమైన శివయ్య విగ్రహాన్ని రూపొందించారు. నాగుపాము పడగ నీడలో శివుడు ఆశీర్వదిస్తున్నట్లున్న ఈ కళాఖండాన్ని చూసి అందరూ అబ్బురపడుతున్నారు. దయాకర్ సృజనాత్మకతకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News February 15, 2026
ఇండియా Vs పాక్.. జట్లు ఇవేనా?

ఇవాళ్టి హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇండియా, పాక్ జట్లు రెడీ అవుతున్నాయి. ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. జట్ల అంచనా ఇలా..
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య(C), హార్దిక్, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, సుందర్/కుల్దీప్, బుమ్రా, వరుణ్.
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్ అఘా(C), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, సల్మాన్ మీర్జా.


