News October 8, 2025

మహబూబ్‌నగర్‌లో డీఐజీ చౌహన్ తనిఖీలు

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. డీపీఓ, స్పెషల్ బ్రాంచ్, డీసీబీ, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ తదితర విభాగాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరు, రికార్డు నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకత వంటి అంశాలపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి, అదనపు ఎస్పీలు ఎన్.బి. రత్నం, సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

MBNR పోలీసులను అభినందించిన డీఐజీ

image

MBNRలో నేరాల నివారణ, చట్టాలను కాపాడటంలో జిల్లా పోలీసు బలగాలు చూపుతున్న కృషిని జోన్–VII డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ అభినందించారు. పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరింత క్రమశిక్షణతో ప్రజాసేవలో అగ్రగాములు కావాలని ఆకాంక్షించారు. బలగాల హాజరు రికార్డులు, ఆయుధ నిల్వలు, వాహనాల సంరక్షణ విధానాన్ని పరిశీలించి సిబ్బంది నిబద్ధతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

News October 8, 2025

ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: మధుసూదన్ రెడ్డి

image

దేశంలో ప్రధాని మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని MBNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విమర్శించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తోందని, ఓట్ల చోరీ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని పేర్కొన్నారు.

News October 8, 2025

MBNR: ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మంగళవారం ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై అధికారులకు పూర్తి అవగాహన తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు.