News March 21, 2025

మహబూబ్‌నగర్‌లో వ్యక్తి మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. న్యూటన్ అమృత ప్రైవేట్ హాస్పిటల్ గల్లీలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని MBNR ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Similar News

News March 22, 2025

MBNR: పరిశ్రమల అనుమతులు తక్షణమే మంజూరు: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖలు మంజూరు చేయ్యాల్సిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అదికారులను ఆదేశించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పి.ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News March 22, 2025

MBNR: మహిళలకు న్యాయసేవలు: జిల్లా న్యాయ సేవ

image

పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పరిష్కార చట్టం-2013 చట్టంపై మహిళలందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళ ఉద్యోగినులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మహిళలు పని చేసే కార్యాలయంలో వారిపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

News March 21, 2025

మహబూబ్‌నగర్ బస్టాండ్ రద్దీ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ శుక్రవారం రద్దీగా కనిపించింది. గురువారంతో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో కాలేజీ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులు, బయట రూంలు తీసుకొని చదువుకునే విద్యార్థులు ఖాళీ చేసి సొంతూళ్లకు బయలుదేరారు. వారితో పాటు తల్లిదండ్రులు కూడా రావడంతో బస్టాండ్ రద్దీగా కనిపించింది.

error: Content is protected !!