News April 17, 2025
మహబూబ్‌నగర్: అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News April 19, 2025
BREAKING: గద్వాలలో యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు.
News April 19, 2025
MBNR: నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోకముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. రైతు నష్టపోకుండా విత్తన సంస్థలు,డీలర్లు,నాణ్యమైన లేబుళ్లు ప్యాకింగ్ ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.
News April 19, 2025
కొల్లూరు వాసికి డాక్టరేట్

నవాబుపేట మండలం కొల్లూరు సత్రోనిపల్లి తండాకు చెందిన జర్నలిస్ట్ మల్లికార్జున్ నాయక్‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు ఆయనకు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు. మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా ఎన్నో ఆలోచనాత్మక కథనాలు, అలాగే తాను సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.