News August 6, 2024
మహబూబ్‌నగర్: ఈనెల 7 ఉద్యోగ మేళా !

ఈనెల 7న జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. పద్మావతి తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు హాజరు కావచ్చని తెలిపారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల, మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏదైనా డిగ్రీలో 2019- 2024 వరకు ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News August 31, 2025
విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదగాలి: GN శ్రీనివాస్

విద్యార్థులు కొత్త టెక్నాలజీను నేర్చుకునే ఉన్నత స్థాయికి ఎదగాలని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ (VC) జిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం MBNRలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News August 31, 2025
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు- SP

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి అన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారని, ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీసు అధికారి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
News August 31, 2025
పాలమూరు: మొత్తం విగ్రహాలు..@2,447

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,447 గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని అత్యధికంగా మహబూబ్‌నగర్ రూరల్ PS పరిధిలో 300, అత్యల్పంగా మిడ్జిల్ PS పరిధిలో 88 రిజిస్ట్రేషన్లు అయ్యాయని, అన్ని వినాయక మండపాల జియో-ట్యాగింగ్ పూర్తి నిమజ్జన రూట్‌మ్యాప్‌తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయన్నారు. అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.