News April 8, 2025
మహబూబ్‌నగర్: ఈ పురాతన బురుజు.. చరిత్ర తెలుసా..?

కాకతీయుల కాలంలోని సామంత రాజు గోన గన్నారెడ్డి సామ్రాజ్యంలోని రాజ్యశాల గ్రామాన్నే కాలక్రమేణ నేటి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాలుగా పిలుస్తున్నారు. గ్రామం చుట్టూ 9కోట బురుజులు ఉండేవి. ప్రస్తుతం ఒకటే ఉండగా 6ఫీట్ల బేస్మెంట్ వెడల్పుతో తూర్పు పడమర 31ఫీట్లు, ఉత్తర దక్షిణం 31ఫీట్లు కొలతలతో 50ఫీట్ల ఎత్తుతో భారీగా ఉంటుంది. వీటితో శత్రువుల దాడుల నుంచి ప్రజలను కాపాడేవారని గ్రామస్థులు చెబుతున్నారు.
Similar News
News February 25, 2026
తిరిగి జట్టులో చేరనున్న రింకూ సింగ్!

T20 WC: తండ్రికి అనారోగ్యం నేపథ్యంలో చెన్నై క్యాంప్ నుంచి రింకూ సింగ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు జింబాబ్వేతో మ్యాచ్ నేపథ్యంలో ఇవాళ అతడు తిరిగి భారత జట్టులో చేరతారని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. అయితే రింకూ తుది జట్టులో ఉంటారా, లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. WCలో ఇప్పటిదాకా అతడు ఆడిన 5 మ్యాచుల్లో 24 రన్స్ మాత్రమే చేయడం గమనార్హం.
News February 25, 2026
ఏకీకృత కుటుంబ సర్వేను పూర్తి చేయాలి: కలెక్టర్

యలమంచిలి మండలంలో ఏకీకృత కుటుంబ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. బుధవారం యలమంచిలి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మండలంలో సాగుతున్న ఏకీకృత కుటుంబ సర్వే, ఈ-కేవైసీ, పీ-4 కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
News February 25, 2026
విశాఖలో పర్యటించనున్న ఒడిశా గవర్నర్

ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఐఐఏఎమ్‌లో పుస్తకావిష్కరణ, ‘ప్రైడ్ ఆఫ్ నేషన్’ అవార్డుల ప్రదానం, బాలాజీ హైఫీల్డ్స్ స్కూల్ వార్షికోత్సవం, అమలాపురంలో జరిగే ‘వరల్డ్ తెలుగు కాన్‌క్లేవ్’ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మార్చి 5న తిరిగి భువనేశ్వర్ వెళ్తారు.


