News November 19, 2025
మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News April 5, 2026
TU: ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను పలు సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేశారు. దీంతో శనివారం నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల రీ షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.
News April 5, 2026
టెస్టులపై BCCI ఫోకస్.. తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్!

NZ, SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు ఓడటంతో BCCI రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది. జూన్/జులైలో 64 మంది U25 క్రికెటర్లతో రెడ్ బాల్ ఇంట్రా టోర్నీ నిర్వహించనుంది. వారిని 4 జట్లుగా విభజించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచులు ఆడించనున్నట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు. ఇందులోనుంచి 25 మందిని సెలక్ట్ చేసి టెస్టుల కోసం సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో వైభవ్, మాత్రే కూడా ఉంటారని సమాచారం.
News April 5, 2026
కామారెడ్డిలో జాబ్ మేళా

కామారెడ్డి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఈనెల 7న ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 7వ తరగతి నుంచి ITI చదివి 19-39 ఏళ్ల అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ప్రైవేటు కంపెనీలో 150 ఉద్యోగాలకు ఎంపికలు చేపట్టనున్నారు. ₹30,000 జీతం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కాపీలతో హాజరు కావాలన్నారు.


