News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News April 13, 2026

నాగర్‌కర్నూల్: జనగణనకు పటిష్ట ఏర్పాట్లు – కలెక్టర్

image

జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కోసం జిల్లా వ్యాప్తంగా 1,799, 263 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. వీరికి ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో చేపట్టే ఇండ్ల గణనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

News April 13, 2026

విశాఖ: స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

image

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీ‌ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 13, 2026

NGKL జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

image

NGKL జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. మొత్తం 10,658 మంది విద్యార్థులకు గాను 10,637 మంది హాజరయ్యారని, 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. 99.80 శాతం హాజరు నమోదైందని, పరీక్షల నిర్వహణలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన వెల్లడించారు.