News December 11, 2025

మహబూబ్‌నగర్: ఓటేద్దాం.. చలో చలో..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి విడత GP ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఓటరు మహాశయులారా ఇక సిద్ధమవ్వండి. మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. మహబూబ్‌నగర్ జిల్లాలో 139, గద్వాల -106, నారాయణపేట -67, వనపర్తి – 87, నాగర్‌కర్నూల్ – 151 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పలుచోట్లు ఏకగ్రీమయ్యాయి.
> GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News December 11, 2025

గురజాల సబ్ డివిజన్‌లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

గురజాల సబ్ డివిజన్ పరిధిలో గురువారం 1144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట్రామిరెడ్డి సరెండర్ అవుతారనే సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ కారణంగా ఎటువంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని, శాంతిభద్రతలకు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 11, 2025

సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం: పవన్

image

AP: గతంలో ఎన్నడూ లేని విధంగా 10వేల మందికి పైగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని Dy.CM పవన్ అన్నారు. ‘ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో పోస్టింగ్, ప్రమోషన్‌కు ఓ రేటు కార్డు ఉండేది. కూటమి పాలనలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం’ అని ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో ఆయన అన్నారు.

News December 11, 2025

BHPL: ఓటు హక్కు వినియోగానికి ఇవి తప్పనిసరి: కలెక్టర్

image

ఈనెల 11, 14, 17వ తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా చూపించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఓటర్, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్‌పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లాలని సూచించారు..