News August 23, 2025

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్: ‘ఓ గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం’

image

దేశం ఓ గొప్ప నాయ‌కుడిని కోల్పోయింద‌ని ఎంపీ డీకే అరుణ అన్నారు. మాజీ ఎంపీ, పాల‌మూరు జిల్లా ముద్దుబిడ్డ, సీపీఐ అగ్రనేత, కామ్రేడ్‌ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ఆమె శనివారం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయస్థాయి నేతగా ఎదిగిన గొప్ప నాయ‌కుడు ఎన్నో వామపక్ష ఉద్యమాలు,ప్రజా పోరాటాలతో సుర‌వ‌రం ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయార‌న్నారు.

Similar News

News August 23, 2025

సిద్దిపేట ఐటీ టవర్‌లో ఫ్రీ కోచింగ్

image

సిద్దిపేట ఐటీ టవర్‌(టాస్క్‌)లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ ఇన్‌ఛార్జ్ నరేందర్‌గౌడ్ తెలిపారు. విద్యార్థులకు Java, పైథాన్, వెబ్ డెవలప్‌మెంట్, డేటా బేస్, Sudoku, C, C++, HTML, CSS, Java Scriptతో పాటు ఆప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 25, 26న ఐటీ టవర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News August 23, 2025

ఇంటర్ కాలేజీల్లో అమలులోకి ఫేషియల్ రికగ్నిషన్

image

TG: 430 ఇంటర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలులోకి వచ్చింది. 1,64,621 మంది విద్యార్థుల్లో ఇప్పటికే 63,587 మంది రిజిస్ట్రేషన్ పూర్తైంది. మిగిలిన వారి రిజిస్ట్రేషన్ సోమవారం కల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వాట్సాప్ ద్వారా పేరెంట్స్‌కు హాజరు, రిపోర్ట్స్‌పై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానంతో అటెండెన్స్ మానిటరింగ్, ప్రాక్సీ అటెండెన్స్‌కు చెక్ వంటి లాభాలుంటాయని తెలిపారు.

News August 23, 2025

కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను త్వరితగతిన నమోదు చేయండి: కలెక్టర్

image

వివిధ శాఖలకు పురోగతికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను త్వరితగతిన నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖలకు సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఆర్టీజీఎస్ లెన్స్‌పై సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ లెన్స్ సైట్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.