News January 17, 2026
మహబూబ్‌నగర్ జిల్లాకు నేడు CM రేవంత్

మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. జిల్లాలోని చిట్టిబోయినపల్లిలో ప్రతిష్ఠాత్మక ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంతో మహబూబ్‌నగర్ ప్రాంతంలో ఉన్నత సాంకేతిక విద్యకు కొత్త ఊపొస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుబాటులోకి రానుందని నిపుణులు అంటున్నారు.
Similar News
News February 11, 2026
సూర్యాపేట: క్యూ లైన్‌లో నిలబడి ఓటేసిన కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలోని 14వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ సందర్శించారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన అనంతరం, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటర్ల సౌకర్యార్థం అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.
News February 11, 2026
గుండారం గుట్టల ప్రాంతంలో పెద్దపులి..?

కోహెడ మండలం నుంచి మల్లారం హైవే దాటి పెద్దపులి బెజ్జంకి మండలంలోని మల్లోని చెరువు గుండారం గుట్టల ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే మూడు రోజుల పాటు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని, చీకటి పడే వరకు పొలాల వద్ద ఉండకూడదని హెచ్చరించారు. బెజ్జంకి పోలీసులు కూడా గ్రామస్థులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ గస్తీని పెంచారు.
News February 11, 2026
VKB: 4 మున్సిపాలిటీల్లో @9am 11.15% పోలింగ్

VKBలోని 4 మున్సిపాలిటీల్లో 9 గంటల వరకు 11.15% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ మున్సిపల్‌లో 11.56%, తాండూర్‌లో 10.39% పరిగిలో 10.78%, కొడంగల్‌లో 15.21% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత భారీగా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


