News April 10, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Similar News

News April 18, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 40 డిగ్రీలకు చెరువలో ఎండ

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10గంటలు దాటిందంటే ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నటు పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 21.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  

News April 18, 2025

నాగర్‌కర్నూల్: పోలీస్ కస్టడీలో గ్యాంగ్ రేప్ నిందితులు

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News April 18, 2025

వసతి గృహంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

image

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు. 

error: Content is protected !!