News April 16, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ WARNING

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News September 9, 2025
MBNR: ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. CONGRATS తెలిపిన డీకే అరుణ

భారత ఉపరాష్ట్రతిగా NDA అభ్యర్థి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్‌డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 452 ఓట్లతో విజయం సాధించారు. ఇవాళ ఉదయం డీకే అరుణ దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు.
News September 9, 2025
రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సిరిసిల్ల రాజయ్య రాక

రేపు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య రానున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలకనున్నారు.
News September 9, 2025
తెలుగు యూనివర్శిటీ తొలి Ph.D అందుకున్నది పాలమూరు వ్యక్తే!

MBNRకు చెందిన కపిలవాయి లింగమూర్తి TG ఏర్పడ్డ తర్వాత తెలుగు వర్శిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి. సుమారు 7 దశాబ్దాల పాటు తెలుగు సాహిత్య రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి 2014లో తెలుగు యూనివర్శిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డీలిట్)ను ప్రదానం చేసింది. ప్రతిభ పురస్కారం కూడా అందుకున్నారు. నేడు TG భాషా దినోత్సవం సందర్భంగా Way2News ప్రత్యేక కథనం.