News March 20, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్ సరఫరా, పంటల విస్తీర్ణం తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. చెరువులు, కుంటలు కబ్జా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 14, 2026
MBNR: మున్సిపల్ ఎన్నికలు.. మహిళా అభ్యర్థుల విజయకేతనం

మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని రెండు పురపాలికలు, ఒక నగరపాలికలో జరిగిన ఎన్నికల్లో 32 మందికి పైగా మహిళలు విజయం సాధించి తమ సత్తా చాటారు. దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో మహిళల అఖండ విజయాలు రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌కు, వారి ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచాయి.
News February 14, 2026
మహబూబ్‌నగర్‌లో రీకౌంటింగ్..!

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.
News February 13, 2026
మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్ ఆలస్యం.. కారణం ఏంటో?

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి 1-30 డివిజన్‌ల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 31-60 డివిజన్‌ల ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


