News April 12, 2024

మహబూబ్‌నగర్: తెగ తాగేస్తున్నారు..!

image

ఉమ్మడి జిల్లాలో మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు. ఒక్క మార్చిలోనే గతేడాదికి సమానంగా అమ్మకాలు సాగాయి. 2023లో మార్చిలో రూ.276.82కోట్లు, ఈ మార్చిలోనూ రూ.245కోట్ల వ్యాపారం జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో 261 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతేడాది మార్చిలో 2,66,400కాటన్ల మద్యం, 4,53,100 కార్టన్ల బీర్ల.. ఈఏడాదిలో ఇప్పటివరకు 7,92,326 కార్టన్ల లిక్కర్, 11,40,330 కార్టన్ల బీర్లు అమ్ముడుపోయాయి.

Similar News

News October 27, 2025

MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నలుగురి అరెస్ట్

image

మహబూబ్‌నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. జడ్చర్ల టౌన్ CI కమలాకర్ వివరాల ప్రకారం.. గంజాయి విక్రయంపై దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామని, వారి నుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచామన్నారు.

News October 27, 2025

MBNR: రిపబ్లిక్ డే.. కంటింజెంట్ అధికారిగా అర్జున్ కుమార్

image

గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించే పరేడ్ వేడుకకు కంటింజెంట్ ఆఫీసర్‌గా పీయూ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ఎన్.అర్జున్ కుమార్ ఎంపిక కావడం గర్వకారణమని వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పరిపాలన భవనంలో VCతోపాటు రిజిస్ట్రార్ రమేష్ బాబు,ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె ప్రవీణ అభినందించారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ-రిపబ్లిక్ డే శిబిరానికి వెళ్లనున్నారు.

News October 27, 2025

MBNR: బీ.ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లకు.. 92 దరఖాస్తులు

image

పాలమూరు విశ్వవిద్యాలయం బీ.ఫార్మసీ కోర్సులో మిగిలినటువంటి 11 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించగా సోమవారం సాయంత్రం గడువు ముగిసే సమయానికి 92 దరఖాస్తులు వచ్చాయని రిజిస్ట్రార్ ఆచార్య పి.రమేష్ బాబు తెలిపారు. మంగళవారం వివిధ కేటగిరిల, మెరిట్ ప్రకారం అడ్మిషన్లను ప్రకటిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ అడ్మిషన్ ప్రక్రియలో ప్రిన్సిపల్, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.